రోడ్డు ప్రమాద మరణాల తగ్గింపులో జి.కొండూరు ఠాణా ప్రథమం
ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో తొలి స్థానం… గత ఏడాది 14 మరణాలు.. ఈ ఏడాది ఐదుకు తగ్గుదల… సున్నా ప్రమాద మరణాలే లక్ష్యమంటున్న పోలీసులు…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
జి.కొండూరు, అక్టోబర్ 18: రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడంలో జి.కొండూరు పోలీస్ స్టేషన్ ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు స్టేషన్ హౌస్ అధికారి తెలిపారు. గత ఏడాది ఇదే కాలంలో స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల్లో 14 మంది ప్రాణాలు కోల్పోగా, ఈ ఏడాది ఆ సంఖ్య ఐదుకు తగ్గిందని పేర్కొన్నారు. మరణాల సంఖ్య తొమ్మిది తగ్గడంతో 64.3 శాతం తగ్గుదల నమోదైందని

వివరించారు. నిరంతరం మార్గనిర్దేశం చేసిన పోలీస్ కమిషనర్, డీసీపీ, మైలవరం ఏసీపీ, సీఐలకు కృతజ్ఞతలు తెలిపారు. సిబ్బంది కృషి, వివిధ శాఖల సమన్వయం, ప్రజల సహకారంతో ఈ ఫలితం సాధ్యమైందన్నారు. ప్రమాద మరణాలను సున్నాకు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.

