ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ23, అక్టోబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ప్రభాస్‌ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే బొండా ఉమా

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప నటుడు ప్రభాస్‌... సినిమాల్లోనే కాదు.. సేవా కార్యక్రమాల్లోనూ రెబల్‌ స్టార్‌ ఆదర్శం... ముత్యాలంపాడులో అభిమానుల సందడి.. కేక్‌ కట్‌ చేసిన బొండా ఉమా...

V10TV న్యూస్ డెస్క్ 23 అక్టోబర్, 2026 10:52 AMకి 4,517 వీక్షణలు
ప్రభాస్‌ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే బొండా ఉమా — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 23: తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ప్రముఖ నటుడు, పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ గొప్ప మానవతావాది అని ప్రభుత్వ విప్‌, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. శుక్రవారం ముత్యాలంపాడులోని సిటీ వైడ్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దెందుకూరి మురళీకృష్ణంరాజు కార్యాలయం వద్ద ప్రభాస్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడైన బొండా ఉమా కేక్‌ కట్‌ చేసి ప్రభాస్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభాస్‌ తన నటన, కృషి, పట్టుదలతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు. వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ మానవత్వాన్ని చాటుకుంటూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుంటారని ప్రశంసించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులకు సహాయం అందించడం ఆయన సేవా దృక్పథానికి నిదర్శనమన్నారు. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయంగా పెంచడంలో ప్రభాస్‌ కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన నటిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం ఘనవిజయం సాధించి సరికొత్త రికార్డులు సృష్టించాలని ఆకాంక్షించారు. ప్రభాస్‌ ఆయురారోగ్యాలతో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్‌ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ నవనీతం సాంబశివరావు, దాట్ల రాజేష్‌వర్మ, సోమన అనిల్‌, మనీష్‌వర్మ, రాఘవేంద్రరాజు, అబ్బులు, బోస్‌, రామకోటయ్య, శ్రీను, రామకృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు సీబీఐ చేతికి!

3 నిమిషాల క్రితం 3,356

రెబల్స్‌కు చెక్ పెట్టేనా?.. చంద్రబాబు–పవన్ కీలక భేటీ!

6 నిమిషాల క్రితం 3,676

నామినేషన్ల వేళ హైటెన్షన్.. జోగి రమేష్ గృహ నిర్బంధం!

10 నిమిషాల క్రితం 2,897

బెజవాడలో తీన్మార్ మోగించిన మల్లాది విష్ణు!

3 గంటల క్రితం 3,898