ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

మూలా నక్షత్రం వేళ.. సామాన్య భక్తులకే పెద్దపీట!

ప్రోటోకాల్, సిఫార్సు, అంతరాలయ దర్శనాలు పూర్తిగా రద్దు... కొండపైకి ప్రైవేటు వాహనాలకు నో ఎంట్రీ.. వాహన పాసులన్నీ తాత్కాలికంగా నిలిపివేత... అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు...

V10TV న్యూస్ డెస్క్ 15 అక్టోబర్, 2026 1:57 PMకి 3,591 వీక్షణలు
మూలా నక్షత్రం వేళ.. సామాన్య భక్తులకే పెద్దపీట! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 15: దసరా శరన్నవరాత్రుల్లో అత్యంత విశిష్టమైన మూలా నక్షత్రం సందర్భంగా శుక్రవారం ఇంద్రకీలాద్రికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీ సరస్వతీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ సంయుక్తంగా భక్తులకు పలు సూచనలు చేశారు. అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనమే! మూలా నక్షత్రం రోజున సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని దేవస్థానం నిర్ణయించింది. భక్తులు వేగంగా అమ్మవారిని దర్శించుకునేలా అన్ని క్యూలైన్లను ఉచిత దర్శన మార్గాలుగా నిర్వహించనున్నారు. అంతరాలయ దర్శనాలతో పాటు ప్రోటోకాల్, సిఫార్సు దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. భక్తులందరికీ ముఖమండపం నుంచే అమ్మవారి దర్శనం కల్పించనున్నారు. కొండపైకి ప్రైవేటు వాహనాలకు అనుమతి లేదు భారీ రద్దీ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపైకి ప్రైవేటు వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ఇప్పటికే జారీ చేసిన సర్వీస్ పాసులతో సహా అన్ని రకాల వాహన పాసులను తాత్కాలికంగా నిలిపివేశారు. అత్యవసర అధికారిక వాహనాలకు మాత్రమే అనుమతి కల్పించనున్నారు.

అమ్మవారికి సీఎం పట్టువస్త్రాలు

మూలా నక్షత్రం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఇంద్రకీలాద్రికి విచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రత, భక్తుల రాకపోకలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులు, ప్రముఖులు దేవస్థానం నిర్ణయాలకు సహకరించాలని, క్రమశిక్షణతో ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086