ఎనికేపాడు సెంటర్‌లో రెండు లారీలు ఢీ
ఎనికేపాడు సెంటర్‌లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం లారీలకు స్వల్ప నష్టం.. ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊరట కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం.. రాకపోకలను క్రమబద్ధీకరించిన పోలీసులు

ఆగస్టు 15 (V10TV AP): విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు సెంటర్‌లో శనివారం రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు లారీలకు స్వల్ప నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా ఎనికేపాడు సెంటర్‌లో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకుని వాహనాలను క్రమబద్ధీకరించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

