ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ15, ఆగస్టు 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

సైబర్ మోసాలపై ‘గోల్డెన్ అవర్’లో డయల్ 1930: ఎస్సై పి. శివ

ఆన్‌లైన్ ఆర్థిక మోసం జరిగిన వెంటనే అప్రమత్తమైతే నగదు ఫ్రీజ్‌కు అవకాశం... స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా చట్టాలను గౌరవించాలని పిలుపు... భవానిపురం హౌసింగ్ బోర్డు కాలనీలో రాత్రి గస్తీ పెంచుతామని హామీ...

V10TV న్యూస్ డెస్క్ 15 ఆగస్టు, 2026 5:04 PMకి 1,479 వీక్షణలు
సైబర్ మోసాలపై ‘గోల్డెన్ అవర్’లో డయల్ 1930: ఎస్సై పి. శివ — చిత్రం 1
సైబర్ మోసాలపై ‘గోల్డెన్ అవర్’లో డయల్ 1930: ఎస్సై పి. శివ — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

ఆగస్టు 15 — V10TV AP: సైబర్ మోసానికి గురైనప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘గోల్డెన్ అవర్’లోనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని భవానిపురం ఎస్సై పిన్నింటి శివ సూచించారు. సకాలంలో ఫిర్యాదు చేస్తే బ్యాంకుల సహకారంతో మోసగాళ్ల ఖాతాలకు వెళ్లిన నగదును ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుందన్నారు.

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భవానిపురంలోని కీప్ వెల్ పార్క్‌లో హెచ్‌ఐజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా వందనం కార్యక్రమంలో ఎస్సై పి. శివ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా లభించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా, చట్టాలను గౌరవిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

ఇటీవల సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆన్‌లైన్ ఆర్థిక మోసాలతో పాటు ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు, సైబర్ వేధింపులు, హ్యాకింగ్, ఫొటో మార్ఫింగ్ వంటి సైబర్ నేరాలపై కూడా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు.

సైబర్ మోసాలపై ‘గోల్డెన్ అవర్’లో డయల్ 1930: ఎస్సై పి. శివ — అదనపు చిత్రం 2

ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డు కాలనీవాసులు పార్కు పరిసరాల్లో పోకిరీల బెడద, భద్రతకు సంబంధించిన సమస్యలను ఎస్సై దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన రాత్రి వేళల్లో పోలీస్ గస్తీ పెంచడంతో పాటు నిఘాను మరింత పటిష్టం చేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు జె. ప్రసాదరావు, కార్యదర్శి జి. డేవిడ్ రాజు, జాయింట్ సెక్రటరీ డా. అశోక్ బాబు, వైస్ ప్రెసిడెంట్ శర్మ, ఎల్.వి. ప్రసాదరావు, సీహెచ్.ఎస్. రవికుమార్, సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్ట్ జె.ఎస్.కె. శ్రీనివాసాచారి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పులస కాదు.. పిత! పుస్తెలతాడు తాకట్టు పెట్టి జాతిపితకు గౌరవం

15 నిమిషాల క్రితం 1,237

దేశభక్తి ప్రతి ఒక్కరి బాధ్యత: గవర్నర్‌పేట సీఐ బాలమురళీకృష్ణ

19 నిమిషాల క్రితం 3,708

డ్వాక్రా మహిళకు రూ.50 వేల విలువైన ఎగ్ కార్ట్ అందజేత

43 నిమిషాల క్రితం
1,452

జాతీయ భావంతోనే దేశం మరింత బలపడుతుంది: ఏసీపీ దైవప్రసాద్

53 నిమిషాల క్రితం 3,280