ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ31, ఆగస్టు 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

కొత్త జంటకు ‘సుజనా పెళ్లి కానుక’

పశ్చిమ నియోజకవర్గంలో నూతన దంపతులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక కానుక వధూవరులకు దుస్తులు, స్వీట్లు, పసుపు–కుంకుమ అందజేత సుజనా మిత్ర కోఆర్డినేటర్ల చేతుల మీదుగా కానుక పంపిణీ

V10TV న్యూస్ డెస్క్ 31 ఆగస్టు, 2026 10:03 AMకి 1 వీక్షణలు
కొత్త జంటకు ‘సుజనా పెళ్లి కానుక’ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, ఆగస్టు 31: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో వివాహం చేసుకుంటున్న నూతన దంపతులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేకంగా ‘సుజనా పెళ్లి కానుక’ అందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వివాహ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే కార్యాలయానికి పంపిన కుటుంబాలకు ఈ కానుకను అందజేస్తున్నారు. ఈ కానుకలో వధువుకు చీర, వరుడికి ప్యాంటు–షర్ట్‌తో పాటు స్వీట్ బాక్స్, పసుపు, కుంకుమలను అందిస్తున్నారు. నూతన దంపతుల జీవితంలో మధుర జ్ఞాపకంగా నిలిచేలా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని 41వ డివిజన్ మసీద్ స్ట్రీట్‌కు చెందిన దివంగత అబ్దుల్ గఫార్, గౌసియా దంపతుల కుమార్తె అబ్దుల్ కౌసర్ వివాహం షేక్ అబుబకర్తో ఆదివారం మౌలానగర్‌లో ఘనంగా జరిగింది. వివాహ వేడుకకు ఎమ్మెల్యే కార్యాలయం తరఫున సుజనా మిత్ర కోఆర్డినేటర్లు హాజరై నూతన వధూవరులకు **‘సుజనా పెళ్లి కానుక’**ను అందజేశారు. కొత్త జంట సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఆనందమయమైన వైవాహిక జీవితం గడపాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మెకానిక్‌ కుటుంబాల సంక్షేమానికి అండగా ఉంటా: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

47 నిమిషాల క్రితం 2

గంజాయి ఆనవాళ్లు చెబితే బహుమతి

52 నిమిషాల క్రితం 2

పరుచూరి ప్రసాద్‌ను పరామర్శించిన పట్టాభిరామ్

1 గంట క్రితం 1

ఇంటింటికీ వెళ్లి.. సమస్యలు తెలుసుకుంటూ

18 గంటల క్రితం 2,747