సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు.. వ్యక్తి అరెస్ట్
టీడీపీ, మంత్రి నారా లోకేష్‌పై తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలు… టీడీపీ–జనసేన శ్రేణుల మధ్య విభేదాలు సృష్టించేలా కంటెంట్ పెట్టినట్లు కేసు… హైదరాబాద్‌లో నిందితుడిని అరెస్ట్ చేసిన నల్లపాడు పోలీసులు…

గుంటూరు: టీడీపీ, మంత్రి నారా లోకేష్‌పై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగ వెంకటదుర్గా రాకేష్‌ను నల్లపాడు పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. నిందితుడు ఎర్రబాలెం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. టీడీపీ–జనసేన శ్రేణుల మధ్య విభేదాలు సృష్టించేలా కంటెంట్‌ను ప్రచారం చేశారన్న ఆరోపణలపై రాకేష్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

