ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ28, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

మృత్యుఘోషపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి

ప్రైవేటు బస్సు–ఆటో ఢీ ఘటనలో ఏడుగురి మృతిపై తీవ్ర విచారం... క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం... ప్రైవేటు బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని స్పష్టీకరణ...

V10TV న్యూస్ డెస్క్ 27 ఆగస్టు, 2026 10:22 AMకి 1,970 వీక్షణలు
మృత్యుఘోషపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమరావతి, ఆగస్టు 27: పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు.

ప్రమాద వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్, గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారు ప్రకాశం జిల్లాలోని కొండమంజులూరులో పుట్టినరోజు వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోలో 15 మంది ప్రయాణిస్తుండగా ఏడుగురు మృతి చెందగా, ఎనిమిది మంది గాయపడినట్లు తాజా పోలీసు సమాచారం వెల్లడించింది. గాయపడిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు.

ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రైవేటు బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, సమగ్ర తనిఖీలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వాహనాల భద్రతా ప్రమాణాలు, నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పోలవరం రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి: చిన్నపురెడ్డి రవీంద్రారెడ్డిYc

12 గంటల క్రితం 5

రేషన్ బియ్యం వద్దంటే.. ఖాతాలో డబ్బులు!

13 గంటల క్రితం 1,914

ఆరోగ్యానికి అండగా.. రూ.5.18 లక్షల ఎల్‌ఓసీ

13 గంటల క్రితం 2,325

క్లిక్‌ చేసే ముందు ఆలోచించండి.. సైబర్‌ మోసానికి చెక్‌ పెట్టండి!

14 గంటల క్రితం 3,660