అరబ్ తుపాను సహాయక చర్యలకు ఎస్బీఐ రూ.5.01 కోట్ల విరాళం
ముఖ్యమంత్రి చంద్రబాబుకు విరాళం చెక్కు అందజేత… అమరావతి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన ఎస్బీఐ ఎండీ… వరద బాధితులను ఆదుకునేందుకు బ్యాంకు సహకారం…

అమరావతి, అక్టోబర్ 31: అరబ్ తుపాను కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి అండగా నిలిచేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. తుపాను సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5.01 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు శనివారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అమర్ రామ్మోహన్ రావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి విరాళం చెక్కును అందజేశారు. తుపాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకునేందుకు బ్యాంకు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ ప్రతినిధులు తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రభుత్వానికి అండగా నిలవడంతో పాటు సామాజిక బాధ్యతలో భాగంగా సహాయ కార్యక్రమాలకు సహకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్బీఐ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. విపత్తు సమయంలో బాధితులకు చేయూతనిచ్చేందుకు కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.

