ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ప్రతి ఇంటిపై సోలార్‌ ఏర్పాటే లక్ష్యం

విద్యుత్‌ బిల్లుల భారం తగ్గించేందుకు సౌర విద్యుత్‌కు ప్రోత్సాహం… ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకంతో రాయితీలు, బ్యాంకు రుణాలు… కృష్ణానగర్‌లో ఇద్దరి ఇళ్లపై సోలార్‌ ప్యానెళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే…

V10TV న్యూస్ డెస్క్ 13 అక్టోబర్, 2026 6:11 PMకి 5,900 వీక్షణలు
ప్రతి ఇంటిపై సోలార్‌ ఏర్పాటే లక్ష్యం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 13: ప్రతి ఇంటిపై సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటు కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పేర్కొన్నారు. 2029 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. మంగళవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని కొత్త 19వ డివిజన్‌ కృష్ణానగర్‌లో ఆయన పర్యటించారు. స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రధానమంత్రి సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన పథకం కింద ఇద్దరు లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్‌ ప్యానెళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటి పైకప్పులపై సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్‌ బిల్లుల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్‌ రంగంలో చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా సౌర విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలతో పాటు బ్యాంకుల నుంచి రుణ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రధానమంత్రి సూర్యఘర్‌ పథకం ద్వారా సబ్సిడీలు అందిస్తున్నారని, ఎస్సీ, ఎస్టీలకు పూర్తి రాయితీ, బీసీలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అర్హులైన కుటుంబాలన్నీ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మమ్మనేని ప్రసాద్‌, నూతి శ్రీను, మాదిరెడ్డి రవి, సొంటి నాగేశ్వరరావు, శివాజీ, ధూళిపాళ్ల రాజేష్‌, మమ్మనేని గోపాలకృష్ణ, గొల్లపల్లి శంకర్‌, బావరాజు నాని, కొత్తపల్లి దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

48 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

55 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086