ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ29, అక్టోబర్ 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

74వ డివిజన్‌లో సైకిల్ జోరు.. గోపి సాయికుమార్‌కు మద్దతుగా ప్రచారం

సంక్షేమ పథకాలే కూటమి ప్రభుత్వానికి బలం... సెంట్రల్‌లో రూ.700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని టీడీపీ నేతల వెల్లడి... గోపి సాయికుమార్‌, వంగవీటి రాధాకృష్ణలను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి...

V10TV న్యూస్ డెస్క్ 29 అక్టోబర్, 2026 9:19 AMకి 3,647 వీక్షణలు
74వ డివిజన్‌లో సైకిల్ జోరు.. గోపి సాయికుమార్‌కు మద్దతుగా ప్రచారం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ సెంట్రల్, అక్టోబర్ 28: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 74వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గోపి సాయికుమార్‌కు మద్దతుగా టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ మద్దతు కోరారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసిన నాయకులు కూటమి పాలనలో సంక్షేమానికి, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. పింఛన్ల పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వంటి పథకాలు పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయని వివరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గత 27 నెలల్లో సుమారు రూ.700 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు నాయకులు తెలిపారు. సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వేలాది మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించడం పేదల సొంతింటి కల సాకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. అభివృద్ధి మరింత వేగవంతం కావాలంటే నగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 74వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి గోపి సాయికుమార్‌కు సైకిల్ గుర్తుపై, మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణకు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో టీడీపీ నాయకులు ఎరుబోతు శ్రావణి రామారావు, గుండపు చలపతిరావు, అమర్‌నాథ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

తుఫాను నష్టంపై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

6 నిమిషాల క్రితం 3,684

84వ డివిజన్‌లో కూటమి ఎన్నికల ప్రచారం

42 నిమిషాల క్రితం 5,379

85వ డివిజన్‌లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం

47 నిమిషాల క్రితం 5,764

1వ డివిజన్‌లో వైసీపీ ప్రచార జోరు

3 గంటల క్రితం 5,472