కామన్వెల్త్ పోటీల్లో కృపారావుకు స్వర్ణం
కెనడా వేదికపై పవర్ లిఫ్టింగ్‌లో సత్తా… బంగారు పతకంతో రాష్ట్రానికి కీర్తి తెచ్చిన కృపారావు… స్వర్ణ విజేతను అభినందించిన ఎమ్మెల్సీ వర్ల రామయ్య…

విజయవాడ, అక్టోబరు 5: కెనడాలో ఇటీవల నిర్వహించిన కామన్వెల్త్ పోటీల్లో పవర్ లిఫ్టింగ్ విభాగంలో బంగారు పతకం సాధించిన రాష్ట్రానికి చెందిన శంకు కృపారావును ఎమ్మెల్సీ వర్ల రామయ్య అభినందించారు. అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి కీర్తి తీసుకురావడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశ ప్రతిష్ఠను మరింత పెంచాలని ఆకాంక్షించారు. కృపారావు యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.

