ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

యువతకు ఉద్యోగాలే మా ప్రధాన ఎజెండా

ఇరవై లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం… డీఎస్సీపై రాజకీయ నిరుద్యోగులే ఆరోపణలు చేస్తున్నారు… అమరావతిలో తొలి 156 క్యూబిట్‌ క్వాంటమ్‌ కంప్యూటర్‌ ఏర్పాటు…

V10TV న్యూస్ డెస్క్ 1 అక్టోబర్, 2026 2:32 PMకి 3,843 వీక్షణలు
యువతకు ఉద్యోగాలే మా ప్రధాన ఎజెండా — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

కొచ్చి, అక్టోబరు 1: యువత కలలను సాకారం చేసేందుకు ఉద్యోగాల కల్పననే తమ ప్రభుత్వం ప్రధాన ఎజెండాగా పెట్టుకుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నుంచి క్షేత్రస్థాయి ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరూ ఉద్యోగాల సృష్టిపైనే పనిచేస్తున్నారని తెలిపారు. కొచ్చిలో నిర్వహించిన ‘ఇండియా టుడే కాంక్లేవ్‌ సౌత్‌–2026’లో సీనియర్‌ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని లోకేశ్‌ చెప్పారు. గత ఏడాది దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో దాదాపు 25 శాతం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాయని పేర్కొన్నారు. హార్టికల్చర్‌ నుంచి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వరకు వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తూ, యువతలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. వేగం, సేవ, స్థిరత్వం అనే మూడు అంశాల ఆధారంగా పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నామని వివరించారు. డీఎస్సీ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని, ఇప్పటివరకు ఒక్క ఆరోపణ కూడా నిరూపితం కాలేదన్నారు. క్రీడా కోటాపై విమర్శిస్తున్న వారు ప్రస్తావిస్తున్న ధ్రువపత్రాలు గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జారీ అయ్యాయని చెప్పారు. ఈ అంశంపై న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. క్వాంటమ్‌ సాంకేతికత ఊహ కాదని, అది రాబోయే తరానికి దిశానిర్దేశం చేసే అత్యాధునిక సాంకేతిక రంగమని లోకేశ్‌ పేర్కొన్నారు. దేశంలోనే తొలి 156 క్యూబిట్‌ క్వాంటమ్‌ కంప్యూటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. పరిశోధనలు, మెటీరియల్‌ సైన్స్‌, క్రయోజెనిక్‌ టెక్నాలజీ రంగాలను అనుసంధానించి సమగ్ర క్వాంటమ్‌ వ్యవస్థను నిర్మిస్తామన్నారు. యువత కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా వ్యవస్థలో మార్పును కోరుకుంటోందని లోకేశ్‌ అభిప్రాయపడ్డారు. విద్యా విధానం నిన్నటి అవసరాలకు కాకుండా రేపటి అవసరాలకు అనుగుణంగా మారాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 16 వేల మంది ఉపాధ్యాయులను నియమించామని, గత రెండేళ్లలో 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు తిరిగి వచ్చారని వెల్లడించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవి తన ప్రాధాన్యత కాదని, విద్యావ్యవస్థను వీలైనంత త్వరగా మార్చడమే తన లక్ష్యమని లోకేశ్‌ స్పష్టం చేశారు. రాజకీయ కార్యక్రమాలు, క్రికెట్‌ మ్యాచ్‌లకు వెళ్లిన సందర్భాల్లోనూ పారిశ్రామికవేత్తలతో చర్చించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

44 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086