ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ప్రచారానికి కాదు ప్రజలకే ప్రజాధనం

సామాజిక మాధ్యమ ప్రభావశీలులకు చెల్లింపుల విధానం ఉపసంహరించుకోవాలి విద్య, వైద్యం, ఉపాధి రంగాలకు నిధులు కేటాయించాలి ఐసఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సాయికుమార్ డిమాండ్

V10TV న్యూస్ డెస్క్ 25 సెప్టెంబర్, 2026 5:32 PMకి 3,629 వీక్షణలు
ప్రచారానికి కాదు ప్రజలకే ప్రజాధనం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్ 25 : ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారం కోసం సామాజిక మాధ్యమ ప్రభావశీలులకు ప్రజాధనంతో చెల్లింపులు చేసే విధానాన్ని ఉపసంహరించుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం సాయికుమార్ డిమాండ్ చేశారు. అనుచరుల సంఖ్య ఆధారంగా ప్రభావశీలులకు రూ.2,500 నుంచి రూ.15 వేల వరకు చెల్లించాలనే విధానం సమంజసం కాదన్నారు. 10 వేల నుంచి 24,999 మంది అనుచరులు ఉన్నవారికి రూ.2,500, 25 వేల నుంచి 49,999 మందికి రూ.5 వేలు, 50 వేల నుంచి 99,999 మందికి రూ.7,500, లక్షకు పైగా అనుచరులు ఉన్నవారికి రూ.15 వేల వరకు చెల్లించాలని నిర్ణయించడం ప్రజాధనాన్ని ప్రచారానికి వినియోగించడమేనని విమర్శించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల బకాయిలు, యువతకు ఉపాధి వంటి సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమయంలో ప్రభావశీలుల ప్రచారానికి నిధులు కేటాయించడంపై ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం అవసరమే అయినప్పటికీ ప్రజాధనం వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ విధానం కింద నిధులను ఎలా కేటాయిస్తారు, అర్హులను ఎవరు ఎంపిక చేస్తారు, చెల్లింపులను ఎవరు పర్యవేక్షిస్తారు, ప్రచార ఫలితాలను ఎలా అంచనా వేస్తారనే వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. ప్రజల పన్నులతో సమకూరిన నిధులను విద్య, వైద్యం, ఉపాధి, విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, పేదల సంక్షేమానికే వినియోగించాలని సాయికుమార్ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమ ప్రభావశీలులకు చెల్లింపుల విధానంపై ప్రభుత్వం పునరాలోచించి ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086