ఆపదలోని కుటుంబానికి జీవనోపాధి భరోసా
ఎనికేపాడులో నిరుపేద కుటుంబానికి చిరు వ్యాపార దుకాణం వైఎన్‌ఆర్ చారిటీస్ సహకారంతో ఏర్పాటు సాయం కాదు.. స్వయం ఉపాధికి మార్గం



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
ఎనికేపాడు, సెప్టెంబర్ 28: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబానికి వైఎన్‌ఆర్ చారిటీస్ జీవనోపాధి కల్పించింది. ఎనికేపాడు గ్రామానికి చెందిన బత్తిన సుబ్బారావు, కోటమ్మ దంపతులు తమ కాళ్లపై తాము నిలబడేలా సంస్థ ఛైర్మన్ ఎలమంచిలి జయప్రకాశ్ సహకారంతో చిరు వ్యాపార దుకాణాన్ని


ఏర్పాటు చేశారు. ఆదివారం దుకాణాన్ని ప్రారంభించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆపదలో ఉన్నవారికి డబ్బు అందించడమే కాకుండా శాశ్వత జీవనోపాధి మార్గాన్ని చూపడమే నిజమైన సేవ అని నిర్వాహకులు పేర్కొన్నారు. కుటుంబానికి అండగా నిలిచిన వైఎన్‌ఆర్ చారిటీస్‌కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.

