పల్లె వైద్యానికి కొత్త భవనాల బలం
రూ.103.16 కోట్లతో 264 గ్రామ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం… జనార్ధనపురం వేదికగా ప్రారంభించిన వైద్యశాఖ మంత్రి సత్యకుమార్… ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధ్యక్షతన ప్రారంభోత్సవ కార్యక్రమం…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడివాడ, అక్టోబర్ 7: రాష్ట్రంలోని 24 జిల్లాల్లో రూ.103.16 కోట్ల వ్యయంతో నిర్మించిన 264 గ్రామ ఆరోగ్య కేంద్రాల నూతన భవనాలను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం జనార్ధనపురంలో బుధవారం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నూతన భవనాలను నిర్మించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలకు మౌలిక వసతులు

కల్పించేందుకు చేపట్టిన ఈ భవనాల ప్రారంభోత్సవానికి మంత్రి సత్యకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.ఎస్. బేగ్, కలెక్టర్ డీకే బాలాజీ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.

