దసరాకు మూడంచెల నిఘా.. 3,130 మందితో భద్రతా వలయం!
దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల భద్రతే లక్ష్యంగా పోలీసుల భారీ కార్యాచరణ.. 70కి పైగా విశ్లేషణాత్మక కెమెరాలు.. 30 డ్యాష్‌బోర్డులతో నిరంతర పర్యవేక్షణ.. 40 పార్కింగ్ ప్రాంతాలు.. మూడు హోల్డింగ్ కేంద్రాలతో రద్దీ నియంత్రణకు ప్రణాళిక..

విజయవాడ, అక్టోబర్ 10: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాల నేపథ్యంలో బెజవాడలో భారీ పోలీసు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని నియంత్రించడంతోపాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా వ్యవస్థను సిద్ధం చేశారు. అక్టోబర్ 11 నుంచి 20 వరకు నిర్వహించే దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0, పున్నమి ఘాట్‌లో జాతీయ సరస్ మేళాకు లక్షలాది మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉండటంతో నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ప్రత్యేక భద్రతా ప్రణాళిక రూపొందించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధికారులు, సిబ్బందితో కలిపి సుమారు 3,130 మందిని బందోబస్తుకు నియమించారు. ఆలయ పరిసరాలు, భక్తుల క్యూలైన్లు, ప్రధానరహదారులు, పార్కింగ్ ప్రాంతాలుమాదిరిగా క్యూలైన్లలో వెళ్లి దర్శనం చేసుకుని, ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు. సమావేశంలో డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇతర పోలీసు అధికారులు, బందోబస్తు సిబ్బంది పాల్గొన్నారు., రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద నిపటిష్టం చేశారు. బూమ్ బ్యారియర్లు, యాక్సెస్ కంట్రోలర్లు, కృత్రిమ మేధ ఆధారిత కెమెరాలు, డ్రోన్లు, వాహన నంబర్లను గుర్తించే సాంకేతిక వ్యవస్థలను వినియోగించనున్నారు. ముఖ్యంగా సామాన్య భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని పోలీసు కమిషనర్ అధికారులను ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానంతో రద్దీపై నిఘా దసరా ఉత్సవాల భద్రతలో ఈసారి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేశారు. దాదాపు 30 డ్యాష్‌బోర్డులతో కూడిన అధునాతన కమాండ్ కంట్రోల్ వ్యవస్థనుఏర్పాటు చేశారు. భక్తుల కదలికలను అంచనా వేసేందుకు 70కి పైగా విశ్లేషణాత్మక కెమెరాలను వినియోగించనున్నారు. కృత్రిమ మేధ, డ్రోన్లు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్, డిజిటల్ ట్విన్స్ సాంకేతికతల ద్వారా రద్దీని పర్యవేక్షించనున్నారు. క్యూలైన్లలో భక్తుల సంఖ్య, పార్కింగ్ ప్రాంతాల పరిస్థితి, ఆర్టీసీ, రైల్వే ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు పరిశీలించేలా ఏర్పాట్లు చేశారు. రద్దీ పెరిగిన ప్రాంతాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకునేలా పోలీసు అధికారులకు సూచనలు అందించనున్నారు. మూడు హోల్డింగ్ కేంద్రాలు.. 40 పార్కింగ్ ప్రాంతాలుగతంలో రెండు హోల్డింగ్ కేంద్రాలు ఉండగా, ఈసారి అదనంగా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం మూడు హోల్డింగ్ ప్రాంతాల్లో భక్తుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడ ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు దర్శనానికి పట్టే సమయాన్ని భక్తులకు తెలియజేయనున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో 40 పార్కింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఓం టర్నింగ్ వద్ద వాహనాల పార్కింగ్‌ను పూర్తిగా నిషేధించారు. అనుమతి పత్రాలున్న వాహనాలు మాత్రమే నిర్దేశించిన విధంగా భక్తులను దించి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. డ్రాప్, పికప్ పాసులున్న వాహనాలకు మాత్రమే నిబంధనల ప్రకారం భక్తులను తీసుకెళ్లే అవకాశం కల్పించనున్నారు. సామాన్య భక్తులకు ప్రత్యేక దర్శన మార్గాలురైల్వే స్టేషన్ నుంచి వచ్చే భక్తులు గద్దబొమ్మ సెంటర్ చేరుకుని, ఫ్లైఓవర్ పక్కన ఉన్న సర్వీసు రోడ్డు మీదుగా వినాయక ఆలయం వద్ద క్యూలైన్లలో ప్రవేశించాలి. అక్కడి నుంచి ఓం టర్నింగ్ మీదుగా ఆలయంలోకి వెళ్లి ఉచిత దర్శనం చేసుకోవాలి. కుమ్మరిపాలెం వైపు నుంచి వచ్చే భక్తులు టోల్‌గేట్, దుర్గాఘాట్ అండర్‌పాస్ మీదుగా ఓం టర్నింగ్‌కు చేరుకుని దర్శనానికి వెళ్లేలా మార్గాన్ని నిర్ణయించారు. దర్శనం అనంతరం రావిచెట్టు, శారీ కౌంటర్, శివాలయం మెట్ల మీదుగా దిగివచ్చి అన్నప్రసాదం స్వీకరించి, కనకదుర్గానగర్, రథం సెంటర్ మార్గంలో బయటకు వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం కుమ్మరిపాలెంలోని టీటీడీ ఖాళీ స్థలం నుంచి ఆలయానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. భక్తులతో చిరునవ్వుతో మాట్లాడాలిదసరా బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు, సిబ్బందికి శనివారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు దిశానిర్దేశం చేశారు. భక్తుల పట్ల పోలీసులు సహనంతో, సేవాభావంతో వ్యవహరించాలని సూచించారు. ఆగ్రహం, చిరాకులకు తావివ్వకుండా చిరునవ్వుతో సమాధానాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. రికార్డు చేసిన సందేశాలతో కూడిన మెగాఫోన్ల ద్వారా భక్తులకు మార్గదర్శనం చేయాలని తెలిపారు. దేవస్థాన, రెవెన్యూ, మున్సిపల్, పోలీసు శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమన్నారు. మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించే సిబ్బంది సమయపాలన పాటించాలని, సెక్టార్ ఇన్‌చార్జులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. విధులు ముగిసిన తర్వాత వీలైతే సాధారణ భక్తులమాదిరిగా క్యూలైన్లలో వెళ్లి దర్శనం చేసుకుని, ఏర్పాట్లపై వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు. సమావేశంలో డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇతర పోలీసు అధికారులు, బందోబస్తు సిబ్బంది పాల్గొన్నారు.
