‘52 ఊళ్ల దాహానికి రూ.9.59 కోట్ల భరోసా’
రూ.9.59 కోట్లతో నాగులపల్లి పథకం ఆధునికీకరణ... 52 ఆవాసాలకు పూర్తిస్థాయిలో రక్షిత మంచినీటి సరఫరా... మూడు దశాబ్దాల నాటి పథకానికి కొత్త రూపు.. ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

పిఠాపురం, సెప్టెంబర్ 22 : పిఠాపురం ప్రాంతంలో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపే దిశగా రూ.9.59 కోట్లతో ఆధునికీకరించిన నాగులపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా పిఠాపురం ప్రాంతంలోని 52 ఆవాసాల్లో సుమారు 97 వేల మందికి రక్షిత తాగునీరు అందనుంది. The New Indian Express మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ పథకం ద్వారా చివరి గ్రామాలకు అవసరాలకు తగినంత తాగునీరు చేరడం లేదన్న సమస్య నేపథ్యంలో ఆధునికీకరణ పనులు చేపట్టారు. రూ.9.59 కోట్లతో పునరుద్ధరించిన పథకం ద్వారా చివరి ఆవాసాల వరకు నీటి సరఫరాను మెరుగుపరిచేలా పనులు చేపట్టారు. The New Indian Express పిఠాపురం పర్యటనలో భాగంగా పథకాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆర్డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజనీర్ గాయత్రి దేవి తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. India Live హెడ్లైన్కు

