ఉప్పొంగిన పెద్దవాగు.. నున్నలో రాకపోకలకు బ్రేక్!
నున్న ప్రాంతంలో రహదారిపైకి ఉద్ధృతంగా వరద నీరు ప్రమాదాల నివారణకు బారికేడ్లు ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు సాహసాలు చేయొద్దని సీఐ ప్రభాకర్ హెచ్చరిక


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 24: విజయవాడ గ్రామీణ పరిధిలోని నున్న ప్రాంతంలో పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాగు పొంగిపొర్లి రహదారిపైకి ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సీఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. వరద ప్రవాహం ఉన్న ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు

చేసి రాకపోకలను నిలిపివేశారు. వాహనదారులు, పాదచారులు వరద నీటిలోకి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు అమర్చారు. ప్రజల భద్రత కోసమే ఆంక్షలు విధించినట్లు సీఐ ప్రభాకర్ తెలిపారు. వాహనదారులు సాహసాలు చేసి వరద ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించారు. పోలీసుల హెచ్చరికలను పాటిస్తూ ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని కోరారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ శేఖర్‌తోపాటు సిబ్బంది అక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

