ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

సింగ్‌నగర్‌లో విద్యుత్‌ తనిఖీలు.. 379 అదనపు లోడ్‌ కేసులు

3,066 విద్యుత్‌ సర్వీసులను పరిశీలించిన అధికారులు… 458 కిలోవాట్ల అదనపు లోడ్‌పై రూ.9.16 లక్షల మేర కేసులు… ఒక దుర్వినియోగ కేసు గుర్తింపు.. 39 సర్వీసులకు సీళ్ల ఏర్పాటు…

V10TV న్యూస్ డెస్క్ 7 అక్టోబర్, 2026 7:18 PMకి 4,718 వీక్షణలు
సింగ్‌నగర్‌లో విద్యుత్‌ తనిఖీలు.. 379 అదనపు లోడ్‌ కేసులు — చిత్రం 1
సింగ్‌నగర్‌లో విద్యుత్‌ తనిఖీలు.. 379 అదనపు లోడ్‌ కేసులు — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 7: అజిత్‌సింగ్‌నగర్‌ సెక్షన్‌ పరిధిలో విద్యుత్‌ శాఖ బుధవారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 379 అదనపు లోడ్‌ కేసులను గుర్తించింది. అనుమతించిన లోడ్‌కు మించి మొత్తం 458 కిలోవాట్ల అదనపు లోడ్‌ ఉన్నట్లు గుర్తించి, రూ.9.16 లక్షల మేర కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ విజయవాడ టౌన్‌ డివిజన్‌లోని డీ–4 సబ్‌ డివిజన్‌ పరిధిలో ఈ తనిఖీలు చేపట్టారు. విద్యుత్‌ విజిలెన్స్‌ కార్యనిర్వాహక ఇంజనీర్‌ పి.విజయకుమారి ఆధ్వర్యంలో, టౌన్‌ డివిజన్‌ కార్యనిర్వాహక ఇంజనీర్‌ ఆర్‌.రవికిషోర్‌ సారథ్యంలో 40 బృందాలు, మరో రెండు విద్యుత్‌ చౌర్య నిరోధక బృందాలు పాల్గొన్నాయి. మొత్తం 106 మంది అధికారులు, సిబ్బంది 3,066 విద్యుత్‌ సర్వీసులను పరిశీలించారు. మొదటి కేటగిరీకి చెందిన 374 సర్వీసుల్లో 452 కిలోవాట్ల అదనపు

సింగ్‌నగర్‌లో విద్యుత్‌ తనిఖీలు.. 379 అదనపు లోడ్‌ కేసులు — అదనపు చిత్రం 2

లోడ్‌పై రూ.9.04 లక్షలు, రెండో కేటగిరీకి చెందిన ఐదు సర్వీసుల్లో ఆరు కిలోవాట్ల అదనపు లోడ్‌పై రూ.12 వేల మేర కేసులు నమోదు చేశారు. మరో విద్యుత్‌ దుర్వినియోగ కేసును గుర్తించారు. తనిఖీల్లో నిలిచిపోయిన ఎనిమిది మీటర్లను గుర్తించగా, సీళ్లు లేని 39 సర్వీసులకు అక్కడికక్కడే సీళ్లు ఏర్పాటు చేశారు. విద్యుత్‌ వినియోగం నమోదు కాని సర్వీసులు, బిల్లింగ్‌ నిలిచిపోయిన సర్వీసులతోపాటు ఇతర ప్రత్యేక సర్వీసులను పరిశీలించారు. వినియోగదారులు తమ వాస్తవ విద్యుత్‌ లోడ్‌కు అనుగుణంగా అనుమతులు పొందాలని లేదా అదనపు లోడ్‌ను క్రమబద్ధీకరించుకోవాలని అధికారులు సూచించారు. మీటర్లు, సర్వీసుల్లో లోపాలుంటే వెంటనే విద్యుత్‌ శాఖకు తెలియజేయాలని కోరారు. తనిఖీల్లో డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజనీర్‌ ఎం.గోవిందరాజు, సహాయ కార్యనిర్వాహక ఇంజనీర్‌ డి.కిరణ్‌కుమార్‌, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086