ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ఇంద్రకీలాద్రికి శాశ్వత రక్షణ కవచం

కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్ రాక్ బోల్టింగ్ షాట్‌క్రీటింగ్ రక్షణ వలల ఏర్పాటుపై సమీక్ష దసరా ఉత్సవాల నాటికి ఘాట్‌రోడ్డు సురక్షితంగా ఉండాలని ఆదేశం

V10TV న్యూస్ డెస్క్ 26 సెప్టెంబర్, 2026 4:04 PMకి 3,114 వీక్షణలు
ఇంద్రకీలాద్రికి శాశ్వత రక్షణ కవచం — చిత్రం 1
ఇంద్రకీలాద్రికి శాశ్వత రక్షణ కవచం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్ 26 : భారీ వర్షాలతో ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దేవస్థాన అధికారులు, ఇంజినీరింగ్ నిపుణులతో కలిసి ప్రభావిత ప్రాంతం, రక్షణ గోడలు, కొండ వాలు భాగాలను పరిశీలించి చేపట్టాల్సిన భద్రతా చర్యలపై సమీక్షించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో భక్తుల భద్రతకే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కమిషనర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత ప్రత్యామ్నాయ రక్షణ చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బెంగళూరుకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ గతంలో సమర్పించిన సాంకేతిక నివేదిక ఆధారంగా చేపట్టాల్సిన పనులపై ఘటనా స్థలంలోనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నీటి

ఇంద్రకీలాద్రికి శాశ్వత రక్షణ కవచం — అదనపు చిత్రం 2

ఊటల కారణంగా పట్టు కోల్పోయిన వదులైన రాళ్లను శాస్త్రీయంగా తొలగించడం, కొండ వాలును పటిష్టం చేసేందుకు రాక్ బోల్టింగ్, షాట్‌క్రీటింగ్ పనులు చేపట్టడంపై చర్చించారు. కొండపై నుంచి రాళ్లు ఘాట్‌రోడ్డుపైకి పడకుండా ఏర్పాటు చేసిన అధిక సామర్థ్యం గల ఇనుప రక్షణ వలలను పరిశీలించారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త వలలను ఏర్పాటు చేయాలని సూచించారు. వర్షపు నీరు కొండచరియల్లోకి ఇంకి ఒత్తిడి పెంచకుండా ప్రత్యేక కాలువల ద్వారా నేరుగా కిందకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దసరా మహోత్సవాల నాటికి ఘాట్‌రోడ్డు పూర్తిగా సురక్షితంగా ఉండేలా అన్ని సాంకేతిక, ఇంజినీరింగ్ పనులను సమన్వయంతో పూర్తి చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. పరిశీలనలో నిర్మ్ శాస్త్రవేత్త జైన్, దేవాదాయ శాఖ సాంకేతిక సలహాదారు సుబ్బారావు, చీఫ్ ఇంజినీర్ శేఖర్, ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086