చంద్రాలలో టీడీపీలోకి 40 కుటుంబాలు!
చావ కాళీప్రసాద్ ఆధ్వర్యంలో చేరికలు.. కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము... అందరి ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక.. పార్టీలో వ్యక్తిగత ఇష్టాలకు చోటులేదన్న రాము... జనసేన అభ్యర్థుల విజయాన్ని కూడా టీడీపీ శ్రేణులు బాధ్యతగా తీసుకోవాలని పిలుపు...

గుడ్లవల్లేరు, అక్టోబర్ 23: గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు మండలం చంద్రాల గ్రామానికి చెందిన 40 కుటుంబాలు శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరాయి. గ్రామ పెద్ద చావ కాళీప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై నమ్మకంతో టీడీపీలో చేరినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. అందరి అభిప్రాయాలతోనే నిర్ణయాలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ పార్టీలో అందరూ సమానమేనని, వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు కాకుండా ప్రజా సంక్షేమం, పార్టీ ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు గ్రామ, మండల నాయకత్వ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. ఒకరిద్దరి ఇష్టానుసారం పార్టీ నడిచే పరిస్థితిని అంగీకరించబోమన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. జనసేన గెలుపునూ బాధ్యతగా తీసుకోవాలి కూటమి పార్టీల మధ్య సమన్వయం అత్యంత అవసరమని రాము పేర్కొన్నారు. టీడీపీ అభ్యర్థుల విజయానికి ఎంత ప్రాధాన్యం ఇస్తామో జనసేన అభ్యర్థుల విజయానికి కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కూటమిలోని ప్రతి అభ్యర్థి విజయం ఉమ్మడి లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీలో చేరిన అడుసుమిల్లి శీనుబాబు, మాధవ్ దేవ్, విశ్వేశ్వర్, కామినేని గంగాధరరావు, కాళీశెట్టి సురేష్, సోరయ్య, ఆత్మకూరి సురేష్, ప్రభాకర్ తదితరులతో పాటు మండల టీడీపీ అధ్యక్షుడు పోలవరపు వెంకటరావు, మార్కెట్ యార్డు చైర్మన్ పొట్లూరి రవి, పిన్నమనేని బాబ్జి, కొడాలి రామరాజు, ఈడే మోహన్, దుగ్గిరాల శేషుబాబు, జనసేన నాయకుడు పేర్ని జగన్ తదితరులు పాల్గొన్నారు.

