ఈశ్వరయ్యను పరామర్శించిన హరీశ్‌రావు
త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన నాయకులు… హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి… పరామర్శించిన వారిలో రామకృష్ణ, పల్లా వెంకట్‌రెడ్డి, నెల్లికంటి సత్యం, కొప్పుల ఈశ్వర్…

హైదరాబాద్, అక్టోబరు 7: ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్యను మంగళవారం బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పరామర్శించారు. సీపీఐ జాతీయ కార్యదర్శులు కె. రామకృష్ణ, పల్లా వెంకట్‌రెడ్డి, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, బీఆర్‌ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తదితరులు కూడా ఈశ్వరయ్యను పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకొని ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర కొనసాగించాలని నాయకులు ఆకాంక్షించారు.

