ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ప్రియురాలిపై కత్తితో దాడి.. భవనంపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య

న్యూ రాజరాజేశ్వరిపేటలో కలకలం… తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి… దాడికి గల కారణాలపై పోలీసుల విచారణ…

V10TV న్యూస్ డెస్క్ 3 అక్టోబర్, 2026 2:15 PMకి 3,246 వీక్షణలు
ప్రియురాలిపై కత్తితో దాడి.. భవనంపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 3: విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో శనివారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చిన్నా అనే యువకుడు ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం సమీపంలోని భవనంపై నుంచి దూకడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం ప్రకారం.. యువతితో కొంతకాలంగా పరిచయం ఉన్న చిన్నా శనివారం ఆమె వద్దకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతిపై దాడి చేశాడు. మెడతోపాటు శరీరంలోని పలు భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె రక్తపు మడుగులో కుప్పకూలింది. దాడి అనంతరం భయాందోళనకు గురైన చిన్నా అక్కడే ఉన్న భవనంపైకి వెళ్లి కిందకు దూకాడు. పై నుంచి బలంగా పడటంతో తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు వెంటనే స్పందించి యువతిని అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించి ఆధారాలు సేకరించారు. యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దాడికి దారితీసిన పరిస్థితులు, ఇద్దరి మధ్య ఉన్న పరిచయం తదితర అంశాలపై దర్యాప్తు చేపట్టారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086