ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

గుడ్లవల్లేరులో రూ.1.60 కోట్ల అభివృద్ధి

మూడు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి శంకుస్థాపన… రూ.40 లక్షలతో రెండు ఫిల్టర్‌ బెడ్లు ప్రారంభం… ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేతుల మీదుగా కార్యక్రమాలు…

V10TV న్యూస్ డెస్క్ 5 అక్టోబర్, 2026 4:15 PMకి 3,414 వీక్షణలు
గుడ్లవల్లేరులో రూ.1.60 కోట్ల అభివృద్ధి — చిత్రం 1
గుడ్లవల్లేరులో రూ.1.60 కోట్ల అభివృద్ధి — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

గుడ్లవల్లేరు, అక్టోబరు 5: గుడ్లవల్లేరు మండలంలో రూ.1.60 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోమవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. గుడ్లవల్లేరు కాలేజీ రోడ్డులో రూ.30 లక్షలతో నిర్మించిన ఫిల్టర్‌ బెడ్‌ను ప్రారంభించారు. ఎన్టీఆర్‌ కాలనీ, నీలకంఠేశ్వరపురం, విన్నకోట గ్రామాల్లో ఒక్కొక్కటి రూ.40 లక్షల చొప్పున మొత్తం రూ.1.20 కోట్లతో నిర్మించనున్న మూడు కమ్యూనిటీ హాళ్లకు భూమిపూజ చేశారు. విన్నకోటలో రూ.10 లక్షలతో నిర్మించిన మరో ఫిల్టర్‌ బెడ్‌ను ప్రారంభించారు. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ సామాజిక బాధ్యత నిధులతో కమ్యూనిటీ హాళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ గుడివాడ–హనుమాన్‌ జంక్షన్‌ మధ్య 35 కిలోమీటర్ల మేర 216వ జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేసేందుకు రూ.1,200 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైందన్నారు. గుడివాడలో 2.6 కిలోమీటర్ల స్పర్‌ రోడ్డుకు రూ.28 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు.

గుడ్లవల్లేరులో రూ.1.60 కోట్ల అభివృద్ధి — అదనపు చిత్రం 2

పట్టణ పరిధిలోని జాతీయ రహదారి అభివృద్ధికి రూ.24 కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. నందివాడ మండలం పుట్టగుంట వద్ద బుడమేరు వంతెన నిర్మాణానికి రూ.100 కోట్లు, భూసేకరణకు రూ.15 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నియోజకవర్గానికి మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధికి విరామం లేదన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని ఇచ్చిన హామీని నూటికి నూరు శాతం నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పల్లె పండుగ ద్వారా గ్రామీణ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని, ఎంపీ బాలశౌరి సహకారంతో నియోజకవర్గానికి మరిన్ని భారీ ప్రాజెక్టులు తీసుకొస్తామని చెప్పారు. కార్యక్రమాల్లో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రావి వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్‌, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ పొట్లూరి రవి, మండల తెదేపా అధ్యక్షుడు పోలవరపు వెంకటరావు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086