ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

నిడమానూరులో 316 కుటుంబాల నలభై ఏళ్ల కల సాకారం

ఈ నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ.... రూ.120 కోట్ల విలువైన స్థలాలపై పేదలకు చట్టబద్ధ యాజమాన్య హక్కులు.... జీవో 306తో దశాబ్దాల సమస్యకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే యార్లగడ్డ...

V10TV న్యూస్ డెస్క్ 29 సెప్టెంబర్, 2026 9:47 AMకి 2,856 వీక్షణలు
నిడమానూరులో 316 కుటుంబాల నలభై ఏళ్ల కల సాకారం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్ 29: విజయవాడ రూరల్ మండలం నిడమానూరు రామానగర్‌లో దశాబ్దాలుగా నివసిస్తున్న 316 పేద కుటుంబాల నలభై ఏళ్ల కల సాకారం కానుందని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఈ నెల 30న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రామానగర్ మండల పరిషత్ నమూనా ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన లబ్ధిదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1986లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కేటాయించిన స్థలాల్లో సొంత ఖర్చులతో ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్న కుటుంబాలకు ఇప్పటివరకు చట్టబద్ధమైన యాజమాన్య పత్రాలు లేవన్నారు. దీంతో ఇళ్లను విక్రయించలేకపోవడం, బ్యాంకు రుణాలు పొందలేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొన్నారని చెప్పారు. న్యాయపరమైన, పరిపాలనాపరమైన అడ్డంకులను అధిగమించి జీవో 306 ద్వారా పట్టాల పంపిణీకి మార్గం సుగమం చేశామన్నారు. లబ్ధిదారులకు అందించనున్న స్థలాల విలువ సుమారు రూ.120 కోట్లు ఉంటుందని తెలిపారు. పట్టాలు అందిన తర్వాత మధ్యవర్తులకు కమిషన్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా నేరుగా బ్యాంకు రుణాలు పొందవచ్చన్నారు. మంత్రి నారా లోకేష్ ఆలోచనతో అమల్లోకి వచ్చిన జీవో 30, జీవో 306 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేలాది పేద కుటుంబాలకు చట్టబద్ధమైన యాజమాన్య హక్కులు లభిస్తున్నాయని వివరించారు. గతంలో నకిలీ పట్టాలతో ప్రజలను మోసం చేశారని ఆరోపించిన యార్లగడ్డ, ప్రస్తుతం శాశ్వత యాజమాన్య హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో ఇప్పటికే గన్నవరంలో 500 మందికి, బాపులపాడులో 426 మందికి, పి నైనవరంలో 289 మందికి, పాతపాడులో 56 మంది గిరిజనులకు పట్టాలు అందించినట్లు గుర్తుచేశారు. నిడమానూరు పంచాయతీ పరిధిలో రూ.5.51 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, రామానగర్‌లో ప్రధాన రహదారుల నిర్మాణానికి మరో రూ.92 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. సీసీ కెమెరాలు, నూతన బస్సు షెల్టర్ ఏర్పాటు చేయడంతోపాటు జాతీయ రహదారిపై డివైడర్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. బస్సు నిలయం ఏర్పాటు కోసం ఆర్టీసీ అధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. కృష్ణా నది నీటితో నిడమానూరు ప్రజలకు సురక్షిత మంచినీరు అందించే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరలో చర్యలు చేపడతామని తెలిపారు. పేదల ఇళ్ల స్థలాల కలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లకు యార్లగడ్డ వెంకట్రావు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

44 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

51 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086