విజయవాడలో డ్రైవర్ లేకుండానే జీపు నడిపిన పోలీసులు
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పోలీసుల సాహస విన్యాసాలు... డ్రైవర్ లేకుండానే జీపు నడిపించిన పోలీసు సిబ్బంది... బైక్ విన్యాసాలతో ఆకట్టుకున్న పోలీసులు...

విజయవాడ, ఆగస్టు 15 – V10TV AP: 80వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా విజయవాడ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో పోలీసులు ప్రదర్శించిన సాహస విన్యాసాలు ఆకట్టుకున్నాయి. డ్రైవర్ లేకుండానే పోలీస్ జీపును చక్కర్లు కొట్టించడం, బైక్‌పై విన్యాసాలు చేయడం వంటి ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విన్యాసాలను తిలకించిన అధికారులు, ప్రజలు పోలీసు సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో పోలీసుల సాంకేతిక నైపుణ్యం, సమన్వయం, సాహసాన్ని ప్రతిబింబించేలా వివిధ ప్రదర్శనలు నిర్వహించారు.

