ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

విశాఖ మేయర్‌ రేసులో నందమూరి తేజస్విని!

బాలకృష్ణ చిన్న కుమార్తె పేరుతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు… జనరల్‌ మహిళకు విశాఖ మేయర్‌ పీఠం రిజర్వేషన్‌… టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య అభ్యర్థిత్వంపై ఉత్కంఠ…

V10TV న్యూస్ డెస్క్ 14 అక్టోబర్, 2026 9:29 AMకి 3,877 వీక్షణలు
విశాఖ మేయర్‌ రేసులో నందమూరి తేజస్విని! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విశాఖపట్నం, అక్టోబర్‌ 14: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పదవిని జనరల్‌ మహిళకు కేటాయించడంతో అధికార కూటమిలో ఆశావహుల ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె, విశాఖ ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్‌ సతీమణి నందమూరి తేజస్విని పేరు మేయర్‌ అభ్యర్థిత్వానికి సంబంధించి ప్రచారంలోకి వచ్చింది. నందమూరి కుటుంబ నేపథ్యం, విశాఖ ఎంపీ కుటుంబంతో సంబంధాల నేపథ్యంలో తేజస్విని పేరుపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఆమె అభ్యర్థిత్వంపై తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు మేయర్‌ పదవిపై జనసేన, బీజేపీ నాయకుల్లోనూ ఆసక్తి నెలకొంది. కూటమి తరఫున ఏ పార్టీ అభ్యర్థిని నిలబెడతారు? మిత్రపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదురుతుందా? అనే అంశాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అక్టోబర్‌ 12న జారీ చేసిన జీవో నంబర్‌ 252 ద్వారా విశాఖ మేయర్‌ స్థానాన్ని జనరల్‌ మహిళకు కేటాయించారు. ఈసారి మేయర్‌ను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానం అమల్లోకి రానుండటంతో అభ్యర్థుల ఎంపిక మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086