ఇంటింటికీ కూటమి ప్రభుత్వం.. ప్రజల సమస్యలపై ఆరా
కృత్తివెన్నులో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసిన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్... సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన నేతలు... స్థానిక సమస్యల పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేస్తామని హామీ...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
మచిలీపట్నం, ఆగస్టు 12: కృత్తివెన్ను మండలం కృత్తివెన్ను గ్రామంలో నిర్వహించిన ‘ఇంటింటికీ కూటమి ప్రభుత్వం’ కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ చైర్మన్, కృష్ణాజిల్లా అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తితో కలిసి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు.
ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. స్థానికంగా ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తామని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సహకారంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తోందని కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.

