ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

కూటమి చైర్మన్‌ అభ్యర్థిగా పులి అరుణకుమారికి మద్దతు

స్థానిక నాయకత్వానికి, పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి… ప్రతిపక్షంలోనూ గెలిచిన ప్రజాదరణను పరిగణనలోకి తీసుకోవాలని వాదన… ఇబ్రహీంపట్నం–కొండపల్లిలో పరిచయాలు, సహచరుల అండ కలిసొస్తాయంటున్న మద్దతుదారులు…

V10TV న్యూస్ డెస్క్ 15 అక్టోబర్, 2026 5:36 PMకి 2,605 వీక్షణలు
కూటమి చైర్మన్‌ అభ్యర్థిగా పులి అరుణకుమారికి మద్దతు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

ఇబ్రహీంపట్నం, అక్టోబర్‌ 15: కొండపల్లి పురపాలక చైర్మన్‌ పదవికి కూటమి అభ్యర్థిగా పులి అరుణకుమారికి అవకాశం కల్పించాలని ఆమె మద్దతుదారులు కోరుతున్నారు. స్థానికంగా ప్రజలతో మమేకమై, పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేసిన నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అభ్యర్థి ఎంపికలో ప్రజాదరణ, రాజకీయ అనుభవం, స్థానిక నాయకులతో సమన్వయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని విజయం సాధించడం అరుణకుమారికి ఉన్న ప్రజా ఆదరణకు నిదర్శనమని ఆమె అనుచరులు చెబుతున్నారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడం, సొంత సామాజికవర్గం మద్దతు ఆమెకు ప్రధాన బలాలుగా పేర్కొంటున్నారు. ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో ప్రజలతో ఉన్న అనుబంధం, నాయకులు, సహచరుల అండదండలు కూటమి విజయానికి ఉపయోగపడతాయని అభిప్రాయపడుతున్నారు. స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న అరుణకుమారికి అవకాశం ఇస్తే ఎన్నికల కార్యాచరణను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లగలరని వాదిస్తున్నారు. కొత్త ముఖాలను తెరపైకి తీసుకొస్తే స్థానిక నాయకులు, కార్యకర్తలతో పరిచయాలు పెంచుకుని సమన్వయం సాధించేందుకు సమయం అవసరమవుతుందని మద్దతుదారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కోసం పనిచేసిన అనుభవం, స్థానిక బలాన్ని గుర్తించి అరుణకుమారి అభ్యర్థిత్వాన్ని కూటమి నాయకత్వం పరిశీలించాలని కోరుతున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

43 నిమిషాల క్రితం 3,489

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

51 నిమిషాల క్రితం 3,782

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

57 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086