ఇంద్రకీలాద్రికి విజయ్.. చంద్రబాబుతో కీలక భేటీ!
దుర్గమ్మను దర్శించుకోనున్న తమిళనాడు ముఖ్యమంత్రి... గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా ఇంద్రకీలాద్రికి... గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై చంద్రబాబుతో చర్చలు...

విజయవాడ, అక్టోబర్ 12: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం విజయవాడలో పర్యటించనున్నట్లు సమాచారం. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు. అందుబాటులో ఉన్న పర్యటన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో దుర్గమ్మ ఆలయానికి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 5.45 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకుని గోదావరి–కావేరి నదుల అనుసంధానం, కృష్ణా జలాల విడుదల తదితర అంశాలపై చర్చలు జరపనున్నట్లు సమాచారం. రాత్రి 7.10 గంటలకు పున్నమి ఘాట్‌లో నిర్వహించే విజయవాడ ఉత్సవ్ కార్యక్రమంలో దసరా వేడుకలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. రాత్రి 9 గంటలకు చెన్నైకి తిరుగు ప్రయాణమవుతారని సమాచారం.

