డీఎస్సీపై సీబీఐ విచారణ చేపట్టాలి.. గన్నవరంలో వైసీపీ విద్యార్థి విభాగం రిలే నిరాహార దీక్షలు
గన్నవరంలో ఏపీ జెన్-జెడ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం... డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్... ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గన్నవరం, ఆగస్టు 6: గన్నవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అనగాని సుందర చైతన్య ఆధ్వర్యంలో ఏపీ జెన్-జెడ్ రిలే నిరాహార దీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జడ్పీటీసీ అన్నవరపు ఎలిజిబెత్ రాణి విద్యార్థులకు పార్టీ కండువాలు కప్పి దీక్షలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా అనగాని సుందర చైతన్య మాట్లాడుతూ, డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ అంశాలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు.

అదేవిధంగా, విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు.

