ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ5, నవంబర్ 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ఏపీ విశ్వవిద్యాలయాల ప్రతిష్ఠ మసకబారుతోంది!

విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడొద్దు... ఉన్నత విద్యారంగంపై శ్వేతపత్రం విడుదల చేయాలి... వైద్య కళాశాలల్లో పరీక్షల అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి: డాక్టర్ అంబటి...

V10TV న్యూస్ డెస్క్ 5 నవంబర్, 2026 11:30 AMకి 6,808 వీక్షణలు
ఏపీ విశ్వవిద్యాలయాల ప్రతిష్ఠ మసకబారుతోంది! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 5 : ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యారంగం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోందని, విశ్వవిద్యాలయాల ప్రతిష్ఠ దిగజారుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ విమర్శించారు. గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిస్థితిపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. క్యూఎస్ ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్–2027లో భారతీయ విశ్వవిద్యాలయాల్లో 71 శాతం ర్యాంకులు దిగజారాయని పేర్కొంటూ, రాష్ట్రంలోని విద్యాసంస్థల ప్రమాణాలపై సమగ్ర సమీక్ష అవసరమన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సహా పలు విద్యాసంస్థలు అంతర్జాతీయ స్థాయిలో ఆశించిన గుర్తింపు సాధించలేకపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యాపకుల కొరత, పరిశోధనలకు నిధుల లేమి, ప్రయోగశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, పరిశ్రమలతో సమన్వయం లేకపోవడం విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా ప్రభుత్వ విద్యాసంస్థలపై ఆధారపడే పేద, మధ్యతరగతి విద్యార్థులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. వైద్య, దంత వైద్య కళాశాలల్లో చోటుచేసుకుంటున్నట్లు వెలుగులోకి వచ్చిన కాపీయింగ్, పరీక్షల అక్రమాల ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వైద్యులను తయారుచేసే విద్యాసంస్థల్లో పరీక్షల పారదర్శకత దెబ్బతింటే వైద్య విద్యపై ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుందని హెచ్చరించారు. అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల ఖాళీలు, పరిశోధన నిధులు, మౌలిక సదుపాయాలు, గత ఐదేళ్ల ఉద్యోగ నియామకాల వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, ప్రాంగణ నియామకాలు, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. విద్యార్థుల్లో ప్రతిభకు కొరత లేదని, అవకాశాలు కల్పించడంలోనే పాలకుల వైఫల్యం కనిపిస్తోందని డాక్టర్ అంబటి నాగ రాధాకృష్ణ యాదవ్ విమర్శించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

గన్నవరం పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కమిషనర్ తనిఖీలు!

29 నిమిషాల క్రితం 5,875

నవంబర్ 23న మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారం!

1 గంట క్రితం 8,565

భారీ వర్షాల మధ్య ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి!

2 గంటల క్రితం 7,530

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరో ప్రమాదం!

2 గంటల క్రితం 6,860