ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ5, నవంబర్ 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

భారీ వర్షాల మధ్య ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి!

పోలింగ్ కేంద్రాల్లో నీరు నిలవకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు... బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి భద్రతకు పటిష్ట ఏర్పాట్లు... ప్రత్యామ్నాయ మార్గాలు సిద్ధం చేయాలి.. అధికారులకు కలెక్టర్ లక్ష్మీశ ఆదేశాలు...

V10TV న్యూస్ డెస్క్ 5 నవంబర్, 2026 10:29 AMకి 7,530 వీక్షణలు
భారీ వర్షాల మధ్య ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 5 : వర్షాల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద వర్షపు నీరు నిల్వ ఉండకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎన్నికల ఏర్పాట్లను అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. వర్షాల కారణంగా బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి తడిసిపోకుండా పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రాంతాల్లో ఎన్నికల సిబ్బంది, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే గుర్తించాలని తహసీల్దార్లను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో రహదారులపై అడ్డంకులను తొలగించేందుకు క్రేన్లు, జేసీబీలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందితో పాటు పోలీసులకు భోజనం, తాగునీరు, వైద్యసేవలు, ఇతర కనీస సౌకర్యాలు కల్పించడంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ముంపు ప్రాంతాలు, ఏటిగట్ల వెంబడి రెవెన్యూ అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని, అవసరమైన చోట డ్రోన్లను వినియోగించాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను ముందస్తు జాగ్రత్తగా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూనే ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, పూర్తి అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ఏపీ విశ్వవిద్యాలయాల ప్రతిష్ఠ మసకబారుతోంది!

15 నిమిషాల క్రితం 6,803

నవంబర్ 23న మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారం!

29 నిమిషాల క్రితం 8,565

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరో ప్రమాదం!

2 గంటల క్రితం 6,860

కృష్ణా జిల్లాలో ఎన్నికలకు ఖాకీ కవచం!

14 గంటల క్రితం 9,889