ట్రేడింగ్ లాభాల మాయలో రూ.11 లక్షలు గల్లంతు
అధిక లాభాల ఆశ చూపి యువకుడికి వల... తొలుత రూ.20 వేలు పెట్టుబడిగా చెల్లింపు... విడతలవారీగా రూ.11 లక్షలు కాజేసిన మోసగాళ్లు...

విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వ్యాపారవేత్త నాగార్జునరావు సైబర్ మోసానికి గురయ్యారు. ఫేస్‌బుక్‌లో పెట్టుబడులకు సంబంధించిన ప్రకటన చూసిన ఆయన ఓ వ్యక్తిని సంప్రదించారు. మొదట రూ.20 వేలు పెట్టుబడిగా చెల్లించగా, ట్రేడింగ్‌లో రూ.20 లక్షల లాభం వచ్చినట్లు నమ్మించారు. ఆ మొత్తాన్ని తీసుకోవాలంటే మరింత నగదు చెల్లించాలని చెప్పడంతో విడతలవారీగా మొత్తం రూ.11 లక్షలు పంపించారు. అనంతరం మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

