విజయవాడ జీజీహెచ్లో కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన
సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్… వంద శాతం స్థూల వేతనం చెల్లించాలని నినాదాలు… ఏటా ఇంక్రిమెంట్లతోపాటు సేవా ప్రయోజనాలు కల్పించాలని వినతి…

విజయవాడ: విజయవాడ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో కాంట్రాక్టు ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆదివారం ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. వంద శాతం స్థూల వేతనం చెల్లించడంతోపాటు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. ఇతర ఉద్యోగుల మాదిరిగానే అన్ని సేవా ప్రయోజనాలను వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నప్పటికీ తమ సమస్యలకు పరిష్కారం లభించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

