ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

కండ్రికలో పార్కు అభివృద్ధికి శ్రీకారం

పలగాని బాబురావు పార్కు పనులకు ఎమ్మెల్యే బొండా ఉమా శంకుస్థాపన... సెంట్రల్ నియోజకవర్గంలో రూ.700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడి... రూ.11 కోట్లతో పార్కుల అభివృద్ధికి చర్యలు.. ఆధునిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం...

V10TV న్యూస్ డెస్క్ 12 అక్టోబర్, 2026 11:49 AMకి 3,668 వీక్షణలు
కండ్రికలో పార్కు అభివృద్ధికి శ్రీకారం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పార్కులను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సోమవారం 64వ డివిజన్ కండ్రిక పంప్‌హౌస్ వద్ద పలగాని బాబురావు పార్కు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని పార్కుల అభివృద్ధికి సుమారు రూ.11 కోట్లతో పనులు చేపట్టే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. పార్కుల్లో మహిళలు వ్యాయామం చేసుకునేందుకు ప్రత్యేక సౌకర్యాలు, చిన్నారులకు ఆటస్థలాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతర్గత ప్రాంతాల్లో ఉన్న పార్కులను సైతం అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు రూ.700 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు బొండా ఉమా వెల్లడించారు. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, పాఠశాలలు, ఆసుపత్రులు తదితర మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సామాజిక పింఛన్లను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచామని, తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం, స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని వివరించారు. విజయవాడ సెంట్రల్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో లబ్బా వైకుంఠం, కోలా శ్రీను, పైడి శ్రీను, పలగాని భాగ్యలక్ష్మి, మోత్కూరి కాసిం, ఎస్‌కే బాబు, కాకొల్లు సాయిహర్ష, ఝాన్సీ, రాజేష్, తెల్ల భవాని, కోరాడ రమణ, బలుగూరి ప్రసాద్ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

44 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086