హోంగార్డుల కుటుంబాలకు రూ.21.60 లక్షల బీమా ఆసరా
ఇద్దరి కుటుంబాలకు రూ.10.80 లక్షల చొప్పున చెక్కుల అందజేత… విద్యుదాఘాతం, రోడ్డు ప్రమాదంలో హోంగార్డుల మృతి… చెక్కులు అందించిన అడ్మిన్ డీసీపీ కేజీవీ సరిత…

విజయవాడ, అక్టోబర్ 8: ప్రమాదవశాత్తు మృతి చెందిన ఇద్దరు హోంగార్డుల కుటుంబాలకు బుధవారం సాయంత్రం బీమా చెక్కులను అందజేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ కేజీవీ సరిత బాధిత కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.10.80 లక్షల చొప్పున చెక్కులు అందించారు. హోంగార్డు అబ్దుల్ జానీ విద్యుదాఘాతంతో, మరో హోంగార్డు జీవీ నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీరి కుటుంబాలకు బీమా పరిహారంగా మొత్తం రూ.21.60 లక్షలు అందజేశారు.

