జలరవాణాకు కొత్త దారి.. 11 వంతెనలుకు వీడ్కోలు!
ముచ్చింతల నుంచి మచిలీపట్నం వరకు జలరవాణా అభివృద్ధిపై దృష్టి... రూ.1,700 కోట్లతో పనుల చేపట్టేందుకు ప్రణాళికలు... విజయవాడ–బందరు కాలువపై పాత పంటెన్ల స్థానంలో హై లెవల్ పంటెన్ల నిర్మాణం...

విజయవాడ, నవంబర్ 6 : విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు జలరవాణా మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ముక్త్యాల నుంచి మచిలీపట్నం పోర్టు వరకు సుమారు 168 కిలోమీటర్ల మేర జలరవాణా సౌకర్యాలను విస్తరించే ప్రణాళికలో భాగంగా విజయవాడ–బందరు కాలువపై ఉన్న 11 పాత పంటెన్లను తొలగించి, వాటి స్థానంలో హై లెవల్ పంటెన్లను నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీఈసీ రెండు టెండర్లను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సుమారు రూ.1,700 కోట్ల వ్యయంతో పనులను చేపట్టి మూడేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. జగ్గయ్యపేట నుంచి సిమెంట్ రవాణాతోపాటు విజయవాడ–అమరావతి మధ్య జలమార్గంలో రోజుకు 5 వేల నుంచి 10 వేల మంది ప్రయాణించేలా ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. ప్రస్తుతం కాలువపై ఉన్న పాత పంటెన్లు జలరవాణాకు అడ్డంకిగా మారే అవకాశం ఉండటంతో వాటి స్థానంలో ఎత్తయిన పంటెన్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు జలరవాణా అవకాశాలు మెరుగుపడటంతోపాటు సరకు రవాణా, పర్యాటక రంగాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అయితే పంటెన్ల తొలగింపు, కొత్త నిర్మాణాల ప్రారంభం, టెండర్ల ఖరారు వంటి అంశాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
