ఒకే వేదికపై జగన్, కేటీఆర్, విజయ్!
చెన్నైలో వైఎస్సార్ కుటుంబ వివాహ వేడుకలో రాజకీయ, సినీ ప్రముఖుల సందడి... వైఎస్ అనిల్‌రెడ్డి కుమార్తె శ్రేయ వివాహానికి హాజరైన ప్రముఖులు... ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన అగ్రనేతలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఫొటోలు...

చెన్నై, నవంబర్ 6 : చెన్నైలో జరిగిన వైఎస్సార్ కుటుంబ వివాహ వేడుక రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగ ప్రముఖుల కలయికకు వేదికైంది. వైఎస్ అనిల్‌రెడ్డి కుమార్తె శ్రేయ, ఉజ్వల్ వివాహ వేడుక నవంబర్ 5న చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ నటుడు విజయ్ హాజరయ్యారు. ముగ్గురు ప్రముఖులు ఒకే వేదికపై కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జగన్మోహన్రెడ్డి తన సతీమణి వైఎస్ భారతితో కలిసి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వైఎస్ విజయమ్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, సినీ నటి త్రిషతో పాటు పలువురు ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఒకే వేదికపై కలిసి కనిపించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ముఖ్యంగా జగన్, కేటీఆర్, విజయ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన దృశ్యం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

