ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ6, నవంబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంతంగా పోలింగ్!

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలకు తావులేదు... సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా.. సీసీ, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ... స్ట్రాంగ్ రూమ్‌లకు బ్యాలెట్ బాక్సుల తరలింపు.. భద్రత కట్టుదిట్టం...

V10TV న్యూస్ డెస్క్ 5 నవంబర్, 2026 10:04 PMకి 9,667 వీక్షణలు
పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంతంగా పోలింగ్! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 5: ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిసిందని నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు తెలిపారు. పోలింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా రూట్ మొబైల్ బృందాలు, స్ట్రైకింగ్ ఫోర్సులు, ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్సులు, జోనల్ స్ట్రైకింగ్ ఫోర్సులను నిరంతరం అప్రమత్తం చేసినట్లు కమిషనర్ వివరించారు. వైర్‌లెస్ వ్యవస్థ ద్వారా అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తూ పరిస్థితులను పర్యవేక్షించామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లను క్రమబద్ధీకరించడంతోపాటు కేంద్రాల 100 మీటర్ల పరిధిలో అనధికార వ్యక్తుల సంచారాన్ని నియంత్రించినట్లు తెలిపారు. సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ముందుగానే గుర్తించిన సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు కమిషనర్ వెల్లడించారు. ముఖ్య కూడళ్లలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేయడంతోపాటు సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించామన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది, మొబైల్ బృందాలు, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు సమన్వయంతో పనిచేయడం వల్ల ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగిందని పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను పోలీసు భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించినట్లు తెలిపారు. అక్కడ ప్రత్యేక పోలీసు గార్డులను ఏర్పాటు చేసి నిరంతర పహారా కొనసాగిస్తున్నామన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణతో భద్రతను మరింత పటిష్టం చేసినట్లు వివరించారు. ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బంది, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లను కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్!

4 గంటల క్రితం 9,594

నవంబర్ 11న దుర్గమ్మకు గాజుల అలంకరణ!

5 గంటల క్రితం 8,565

సామాజిక మాధ్యమాల్లో దుర్గమ్మ దసరా వైభవం!

6 గంటల క్రితం 7,579

ఎన్నికల విధుల్లో విషాదం.. పోలింగ్ అధికారి మృతి!

6 గంటల క్రితం 6,592