పసుపు జెండాల నడుమ చంద్రబాబుకు ఘన స్వాగతం
పేదలకు పట్టాల పంపిణీ కోసం నేడు విజయవాడకు ముఖ్యమంత్రి... బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో భారీగా స్వాగత ఏర్పాట్లు... ప్రకాశం బ్యారేజీ నుంచి వన్‌టౌన్ వరకు ప్రత్యేక హోర్డింగులు...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 29: పేదలకు క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం విజయవాడకు విచ్చేయనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికేందుకు పశ్చిమ నియోజకవర్గంలో భారీ ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో ప్రధాన మార్గాలను పసుపు జెండాలు, ప్రత్యేక హోర్డింగులతో అలంకరించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి కెనాల్ రోడ్డు, ఫ్లైఓవర్, వన్‌టౌన్ ప్రాంతాల వరకు

పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేపట్టారు. ముఖ్యమంత్రి పర్యటన మార్గంలో వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పేద కుటుంబాలకు శాశ్వత భూహక్కులు కల్పించే పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. స్వాగత కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులను బుద్ధా వెంకన్న సమన్వయం చేస్తున్నారు.

