ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

నందిగామ అభివృద్ధికి సౌమ్య బాట!

ఆరు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి శంకుస్థాపన… రోడ్ల అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు… వైద్య సేవలు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి…

V10TV న్యూస్ డెస్క్ 14 అక్టోబర్, 2026 9:43 AMకి 3,905 వీక్షణలు
నందిగామ అభివృద్ధికి సౌమ్య బాట! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

నందిగామ, అక్టోబర్ 14: నందిగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల నిర్మాణం, వైద్య సేవల విస్తరణ, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. నందిగామలో ఆరు జీ+1 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పట్టణంలోని 7వ వార్డులో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ అభివృద్ధికి రూ.8.60 లక్షలు కేటాయించారు. పల్లగిరి గట్టు ఎస్సీ శ్మశానవాటికలో రూ.16 లక్షల ఎంపీ ల్యాడ్స్‌ నిధులతో షెడ్డు, ప్రహరీ గోడ, రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కంచికచర్ల మండలంలో రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేశారు. కీసర–ఎస్‌.అమరవరం బీటీ రహదారికి రూ.2 కోట్లు, కీసరలో మరో రహదారికి రూ.30 లక్షలు, కునికినిపాడులో బీటీ రహదారికి రూ.56 లక్షలతో పనులు ప్రారంభించారు. కునికినిపాడులో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ను ప్రారంభించి గ్రామీణ ప్రజలకు వైద్య సేవలను చేరువ చేశారు. అనాసాగరంలో ఎక్స్‌ప్రెస్‌, పల్లెవెలుగు బస్సులకు రిక్వెస్ట్‌ స్టాప్‌ మంజూరు కోసం కృషి చేశారు. నందిగామ డంపింగ్‌ యార్డును పరిశీలించి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. అన్ని వర్గాల సంక్షేమంతో పాటు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే సౌమ్య తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

44 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

51 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086