ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

ఇంద్రకీలాద్రిపై తమిళనాడు సీఎం విజయ్ ప్రత్యేక పూజలు

సంప్రదాయ వస్త్రధారణలో కనకదుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి… క్యూలైన్లలో భక్తులకు చేతులెత్తి అభివాదం చేసిన విజయ్… వేదాశీర్వచనం అందించి, అమ్మవారి శేషవస్త్రాలు, చిత్రపటం బహూకరించిన ఆలయ అధికారులు…

V10TV న్యూస్ డెస్క్ 13 అక్టోబర్, 2026 5:28 PMకి 4,865 వీక్షణలు
ఇంద్రకీలాద్రిపై తమిళనాడు సీఎం విజయ్ ప్రత్యేక పూజలు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 13: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ మంగళవారం సాయంత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన విజయ్ క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు చేతులెత్తి నమస్కరిస్తూ అభివాదం చేశారు. అనంతరం ప్రధానాలయంలోకి వెళ్లి జగన్మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం అనివేటి మండపంలో వేద పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు, కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఆలయ పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ సంయుక్తంగా అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలు, దివ్య చిత్రపటాన్ని విజయ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు, నగర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086