విజయవాడలో జాతీయ స్థాయి ఫిన్‌స్విమ్మింగ్ పోటీలు ప్రారంభం
19 రాష్ట్రాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు… జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి: ఎమ్మెల్యే బొండా ఉమా… క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహదం…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబర్ 10: క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆకాంక్షించారు. శనివారం గాంధీనగర్‌లోని సర్ విజ్జీ స్విమ్మింగ్ పూల్‌లో అండర్‌వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 9వ ఫెడరేషన్ కప్–2026, 3వ ఆల్ ఇండియా ఫిన్‌స్విమ్మింగ్ నేషనల్ ఛాంపియన్‌షిప్, మాస్టర్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్టోబర్ 10 నుంచి 12 వరకు జరిగే

ఈ పోటీల్లో 19 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయన్నారు. జాతీయ స్థాయి పోటీలకు విజయవాడ వేదిక కావడంగర్వకారణమన్నారు. క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు, భద్రత కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్‌లు, నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

