ఊర్మిళానగర్లో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి
ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు స్వయంగా వడ్డింపు శ్రీకృష్ణుడి జీవితం మానవాళికి ఆదర్శం: వెలంపల్లి



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 4 (ఆంధ్రప్రభ): విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఊర్మిళానగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగాయి. శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు దేవదాయ శాఖ మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా శ్రీకృష్ణుడిని దర్శించుకున్న వెలంపల్లి, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సమితి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి, వారిని ఆప్యాయంగా


పలకరించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ, భగవద్గీత ద్వారా మానవాళికి ధర్మమార్గాన్ని బోధించిన శ్రీకృష్ణ పరమాత్ముని జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమన్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదని పేర్కొన్నారు. పండుగ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన శ్రీకృష్ణ సేవా సమితి నిర్వాహకులను అభినందించారు. శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీకృష్ణ సేవా సమితి నిర్వాహకులు, మాజీ కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

