ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

పేదల జీవితాల్లో రేపు చారిత్రక ఘట్టం

ముఖ్యమంత్రి చేతుల మీదుగా 24,057 పట్టాల పంపిణీ... శాశ్వత భూహక్కులతో సొంతింటిపై పూర్తి అధికారం... ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బొండా ఉమా...

V10TV న్యూస్ డెస్క్ 29 సెప్టెంబర్, 2026 11:35 AMకి 3,888 వీక్షణలు
పేదల జీవితాల్లో రేపు చారిత్రక ఘట్టం — చిత్రం 1
పేదల జీవితాల్లో రేపు చారిత్రక ఘట్టం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్ 29: పేదల సొంతింటి కలను సాకారం చేసే ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 24,057 కుటుంబాలకు క్రమబద్ధీకరణ పట్టాలు అందజేయనున్న నేపథ్యంలో మంగళవారం ఆయన స్టేడియంలోని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని పేదల చిరకాల కల నెరవేరబోతోందన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఇళ్లలో నివసిస్తున్నప్పటికీ పూర్తి హక్కులు లేని కుటుంబాలకు ఉచిత రిజిస్ట్రేషన్ చేసి శాశ్వత భూహక్కులు కల్పించడం

పేదల జీవితాల్లో రేపు చారిత్రక ఘట్టం — అదనపు చిత్రం 2

చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌తో పేదలకు తమ ఇళ్లపై చట్టబద్ధమైన హక్కులు లభిస్తాయని తెలిపారు. పిల్లల చదువులు, వివాహాలు, వైద్య అవసరాలతోపాటు బ్యాంకు రుణాలు పొందేందుకు కూడా ఈ ఆస్తి ఉపయోగపడుతుందన్నారు. పేదలకు శాశ్వత భూహక్కులు కల్పించాలనే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతోపాటు శాసనసభలోనూ ప్రస్తావించి, ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 30 ద్వారా పరిష్కారం లభించేలా నిరంతరం కృషి చేసినట్లు తెలిపారు. ‘‘ఈ పట్టాలు కేవలం కాగితాలు కావు. పేద కుటుంబాల భవిష్యత్తుకు భరోసా, తరతరాలకు అందే ఆస్తి హక్కు’’ అని బొండా ఉమా పేర్కొన్నారు. తమ జీవితకాల స్వప్నం నెరవేరుతున్నందుకు లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086