గోదావరి ఉగ్రరూపం.. లంక గ్రామాలకు హెచ్చరిక
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 5 లక్షల క్యూసెక్కులకు చేరిన ప్రవాహం... ఈ రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం... పోలవరం నుంచి కోనసీమ వరకు అధికార యంత్రాంగం అప్రమత్తం...

అమరావతి, సెప్టెంబర్ 26: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద శనివారం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5 లక్షల క్యూసెక్కులకు చేరినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వరద ఉధృతి మరింత పెరిగి శనివారం రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. Visalaandhra వరద నేపథ్యంలో పోలవరం, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నదిలో స్నానాలు, ఈత, చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. వరద నీరు ప్రవహిస్తున్న రహదారులు, వంతెనలను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. Visalaandhra శుక్రవారం సాయంత్రం ధవళేశ్వరం వద్ద ప్రవాహం సుమారు 4.11 లక్షల క్యూసెక్కులు ఉండగా, శనివారం 5 లక్షల క్యూసెక్కులకు పెరిగినట్లు తాజా సమాచారం చెబుతోంది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

