కనకదుర్గమ్మను దర్శించుకున్న ‘స్వచ్ఛ ఆంధ్ర’ పాలకవర్గం
చైర్మన్ పట్టాభిరామ్‌తో కలిసి ప్రత్యేక పూజలు… కుటుంబ సభ్యులతో అమ్మవారి సేవలో డైరెక్టర్లు… అమ్మవారి చిత్రపటాలను బహూకరించిన చైర్మన్…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబరు 1: స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, కార్పొరేషన్ డైరెక్టర్లు తమ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డైరెక్టర్లకు చైర్మన్ పట్టాభిరామ్ కనకదుర్గమ్మ చిత్రపటాలను బహూకరించారు. అమ్మవారిని

దర్శించుకున్నవారిలో డైరెక్టర్లు చిన్ని శ్రీనివాసరావు, రవికుమార్, ఆరుద్ర భూలక్ష్మి, బొమ్మినేని లక్ష్మణరావు, ఎం.నాగలక్ష్మి, ఎన్.పర్వీన్ భాను, బోలెం నాగమణి, పరుచూరి భవానీ రవికుమార్, బుచ్చా రాము, రెడ్డివారి మంజునాథ్, సానారెడ్డి కల్పనారెడ్డి, కూచిపూడి ఉదయభాస్కర్, సాలాది పట్టాభిరామయ్య, మువ్వల వెంకటరమణ తదితరులు ఉన్నారు.

