తిరువూరు చైర్మన్ బరిలో పెనుమల్లి శ్రావణి?
జనసేన అధిష్టానం పరిశీలనలో శ్రావణి పేరు… అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు సమాచారం… అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది…

తిరువూరు, అక్టోబర్ 17: తిరువూరు మున్సిపల్ చైర్మన్ పదవికి జనసేన అభ్యర్థిగా పెనుమల్లి శ్రావణి పేరును పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆమె అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయమై జనసేన అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

